ఉత్తుత్తి దత్తత – నారాయణస్వామి ఎజెండా: డా.యుగంధర్ పొన్న

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలం, చిప్పారపల్లి పంచాయతీ, నాలుగున్నర సంవత్సరాల క్రితం ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి దత్తత తీసుకున్న గ్రామమైన పాళెం యానాది కాలనీని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న, జనసేన నాయకులతో కలిసి సందర్శించారు. యుగంధర్ మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి వెళ్లిన అనేక గ్రామాల్లో ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని ఉత్తుత్తి వాగ్దానం చేసి, చివరికి ఆ గ్రామాన్ని పట్టించుకొనే దాఖలాలు కనపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో జేజేలు పలికిన ప్రజలే, నేడు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అధికారాన్ని చేపట్టిన తర్వాత దత్తత తీసుకుంటానని చెప్పిన పాళెం యానాది కాలనీ, పాళెం గ్రామాలను అభివృద్ధి చేయకుండా, రోడ్లు వేయకుండా, మౌలిక వసతులు కల్పించకుండా ఇంతవరకు ఆ గ్రామాలను ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సందర్శించలేదని ఏద్దేవా చేసారు. ఒక గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేని ఇలాంటి వ్యక్తి, పెనుమూరు మండలాన్ని, అదేవిధంగా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాడని ప్రశ్నించారు. ముమ్మాటికి నారాయణస్వామి వల్ల ఈ నియోజకవర్గానికి ఒరిగేదేమీ లేదని తెలిపారు. నారాయణస్వామి కుటుంబభివృద్ధి కోరుకునేవారని, ఆయనకు నియోజకవర్గ అభివృద్ధికి గిట్టదని ఆగ్రహం వ్యక్తం చేసారు. దయచేసి నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు ఎవరు నారాయణస్వామికి ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే పాళెం యానాది కాలనీ, పాళెం గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అంత మాత్రమే కాదు పెనుమూరు మండలాన్ని తలమానికంగా తయారు చేస్తామని, అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి క్షమాపణ చెప్పాలని కోరారు. ప్రజల ఆగ్రహానికి తప్పకుండా గురి అవుతావని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు రామకృష్ణ, కార్యదర్శులు శేఖర్, నాగేంద్ర, సంయుక్త కార్యదర్శి రాజు, జనసైనికులు రాజు, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి అన్నామలై, కార్వేటి నగరం మండల ప్రధాన కార్యదర్శి రుద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, పెనుమూరు మండల ఉపాధ్యక్షురాలు రేణుక పాల్గొన్నారు.