తురకపేట గ్రామంలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

ఆమదాలవలస నియోజకవర్గం: సరుబుజ్జిలి మండలం, మూలశావలాపురం పంచాయితీ, తురకపేట గ్రామంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ.రామ్మోహన్ రావు మరియు సీనియర్ నాయకులు పాత్రుని పాపారావు ఆధ్వర్యంలో సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి.మురళి మోహన్ మరియు తురకపేట గ్రామ నాయకులు గదిలి రాజలింగం, గదిలి రమణ బాబు సమక్షంలో ఘనంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం జనంలోకి జనసేన కార్యక్రమంతో ఇంటింటికి వెళ్లి, జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన పార్టీ ప్రజలకు ఎలా అండగా నిలబడుతుంది కరపత్ర రూపంలో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొందూరు మండలం అధ్యక్షులు యాలకల రమణ, సరుబుజ్జిలి మండల నాయకులు పేడాడ. రమణ, గొల్లపల్లి శ్రీధర్, సంగంశెట్టి తేజేశ్వరరావు, బి.ఏ నాయుడు, జనపల సతీష్, దాసరి సురేష్, గొల్లపల్లి హరీష్, మీసాల పార్వతీశం, సతివాడ రామకృష్ణ, మురపక రాజశేఖర్, పవన్, మనోజ్, జగన్, బాలకృష్ణ, శ్రీను, ఫణి కుమార్, బుర్జ మండలం నాయకులు మజ్జి రాంబాబు, అప్పలరాజు, తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.