వంగవీటి రంగా కాంస్య విగ్రహావిష్కరణ

  • ఘన నివాళులు అర్పించిన జనసేన నాయకులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: నియోజకవర్గంలోని గాజులరామారం రోడ్డులో ఆదివారం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 10 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర మరియు కూకట్పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధా రాం రాజలింగం, కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ నందగిరి సతీష్, మండలి దయాకర్, కొల్లా శంకర్, రాజేష్, నాగబాబు, మాధవరెడ్డి, మహేష్ నడింపల్లి శ్రీనివాస్, మహిళలు మహాలక్ష్మి వెంకట్ లక్ష్మి మరియు జనసైనికులు పాల్గొన్నారు.