నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన యుపి సీఎం యోగి

కరోనా మహమ్మారి కారణంగా దేశo మొత్తం నిరుద్యోగ సమస్యతో అల్లాడుతోంది.. అయితే  ఈ సమయంలో యూపీ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్పింది. రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని 6 నెలల్లో ఉద్యోగాలు పొందిన వారికి అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించని విధంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిరుద్యోగులకు భారీ నజరానా ప్రకటించారు. శుక్రవారం ఉద్యోగాల భర్తీపై సీఎం యోగి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాలలో ఎలాంటి అవినీతికి అవకాశం ఇవ్వొద్దని పారదర్శకంగా పరీక్షలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఉద్యోగాల ఖాళీలు, భర్తీపై త్వరలో యూపీ ఎస్సీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు ఒక లక్షా ముప్పై ఏడు వేల పోలీసులు ఉద్యోగాలు, యాభై వేల టీచర్ ఉద్యోగాలు, ప్రభుత్వ శాఖలలో ఒక లక్షకు పైగా ఖాళీలను భర్తీ చేసినట్లు అధికారులు వివరించారు.