కొఠారు ఆదిశేషు ఆధ్వర్యంలో జనసేనలోకి చేరిన ఉప్పుగూడెం గ్రామస్తులు

దెందులూరు నియోజకవర్గంలోని, ఉప్పుగూడెం గ్రామంలో కొఠారు ఆదిశేషు నేతృత్వంలో చేపట్టిన జనంలోకి జనసేన కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉప్పుగూడెం గ్రామంలో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నడవడానికి ఊరు ఊరంతా సిద్ధంగా ఉందని, అందుకు చిహ్నంగా కొఠారు ఆదిశేషు సమక్షంలో పార్టీలోకి చేరుతున్నామని.. ఆ ఊరి నాయకులు పేర్కొన్నారు. కొఠారు ఆదిశేషు వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆదిశేషు మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో చేపట్టిన జనంలోకి జనసేన కు అనూహ్య స్పందన లభిస్తుందని.. వెళ్ళిన ప్రతీ గ్రామంలోనూ నాయకులు పార్టీలో చేరడం శుభసూచికమని.. దెందులూరు నియోజకవర్గంలో ఈసారి ఎగరబోయేది జనసేన జెండానే అని స్పష్టం చేసారు.

ఇంటిటికి వెళ్ళి మ్యానిఫెస్టో ప్రతీ ఒక్కరికీ అర్థమయ్యేలా వివరిస్తూ.. పార్టీ సిద్ధాంతాలను బలంగా జనంలోకి తీసుకెళ్తున్నామని.. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాసును ప్రజలు నిరంతరం గుర్తుంచుకోవాలనే ఉద్ద్యేశంతో ఇంటిటికి గాజుగ్లాసు ని ఇచ్చి, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తున్నాము అన్నారు, జనసేనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ మార్పుకు సూచన అని..ముందు ముందు మరింత వేగంతో ప్రజల్లోకి పార్టీని తీసుకెళతామని అన్నారు.

ఈ కార్యక్రమంలోదెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు తిరుపతి వాసు, పూజారి సీతారాం, పరసా వెంకటధర్మతేజ, నిమ్మన రవికుమార్, ఉజ్జు నాగరాజు, ఇప్పిలి రవి, నేతి రామకృష్ణ, ఇంటూరి కృష్ణ, అక్కి నాయుడు, సాయితేజ, భార్గవ్ మరియు ఉప్పుగూడెం నుండి గరికిపాటి సునీల్, గరికిపాటి కొండలు, అంబటి నాగరాజు, గరికిపాటి శ్రీనివాసరావు, భక్తాటి శేఖర్, పసుపులేటి రమేష్, శరత్, ఫణి, మహేష్, సురేష్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.