పర్యావరణ అవగాహనా సదస్సులో పాల్గొన్న వబ్బిన సన్యాసి నాయుడు

శృంగవరపు కోట నియోజవర్గం: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిమిడి సచివాలయంలో గ్రామ కార్యదర్శి శంకర రావు అధ్యక్షతన పర్యావరణ అవగాహన సదస్సు జరిగింది. సదస్సు నుద్దేశించి గ్రామ పెద్దలు జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు మాట్లాడుతూ పర్యావరణం దెబ్బతినడం వల్ల మనుషులు తాగే నీరు, గాలి, తినే ఆహారము కలుషితమై దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయని, పరిశ్రమల కాలుష్యాన్ని, మోటార్ వాహన కాలుష్యాన్ని తగ్గించే మొక్కలను పెంచడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి తద్వారా సూర్య తాపాన్ని నిరోధించే ఓజోన్ పొరను కన్నము పడకుండా జాగ్రత్త లు తీసుకొనేలా ప్రతి ఒక్కరూ భాద్యతతీసుకుని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ పదాల ధర్మ గ్రామములో మొక్కలు నాటుదామని తీర్మానించారు. ఈ కార్యక్రమములో సచివాలయం సిబ్బంది వాలంటీర్స్, ప్రజలు పాల్గొన్నారు.