ఎం పీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుమతితో అక్కచెరువుపాడు చెరువులో మట్టి తవ్వకం

  • 30% గ్రామస్తులకు 70% గ్రామేతర అవసరాలకు తరలింపు

గత నాలుగు సంవత్సరాలుగా లేకపోవడంతో ఇళ్లకు సైతం మట్టి లేక వేచి చూసిన ప్రజలకు వెసులు కల్పిస్తూ తవ్వకాలకు అనుమతినివ్వగా, రెండు రోజులుగా 10 పొక్లైన్లు తో ఒక్కొక్క టి 100 ట్రాక్టర్ల పైగా తరలింపు జరుగుతుంది. చాలా కాలం తర్వాత దొరికిన అనుమతులు గ్రామస్తులు తమ తమ ప్రదేశాల్లో మట్టిని నిల్వ చేయగా, గ్రామస్తులకు పోను మిగిలింది హౌస్ ఫర్ ఆల్ ఇళ్ళకు తరలింపు అని బుకాయింపు జరుగుతుంది. హౌస్ ఫర్ ఆల్ ఇళ్లకు అవసరమైన మట్టి ఎంత? అక్కడ తవ్విన మట్టి ఎంత?, అధికారులు ప్రశ్నిస్తే మూడు అడుగుల మేర అనుమతులు ఉన్నాయన్నారు కానీ అనుమతులు చూపలేకపోయిన అధికారుల వైనం. మూడు అడుగుల లోతు ఎక్కడ సరాసరి 20 అడుగుల పైబడి కిలోమీటర్ల మేర మట్టి తవ్వి తరలిస్తున్నారు. గత నాలుగు ఏళ్లుగా మట్టి అంతకు పోవడంతో తమకు తోచినంత తవ్వుకు దాచుకున్న గ్రామస్తులు ఇదే అదనుగా కొండ్లపూడి మీదగా అనేక ట్రాక్టర్ల తరలింపు జరుగుతుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అక్కచెరువుపాడు చేరుకుని అధికారులు అనుమతతలు కోరగా ఉన్నాయని తెలిపారు. కానీ చూపలేదు.. చెరువులో లోతైన గుంటల వల్ల రానున్న రోజుల్లో పెద్ద గుంటలు ఏర్పడి పొలాలకు నీటి నీటిని అందించేటప్పుడు ప్రమాదాలు పొంచి ఉన్నందున అధికారులు స్పందించి తగు చర్చలు తీసుకొని మట్టిని కట్టడం చేయవలసిందిగా ఉంది. అనుమతులుకు ఏ మేరకు ఇచ్చారు. ఎంతవరకు తవ్వి ఉన్నారో అనేది కూడా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.