రైతులందిరికీ వ్యాక్సిన్‌ అందించాలి.. రాకేష్‌ తికాయత్‌ డిమాండ్‌!

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటున్న రైతులందిరికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందచేయాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేష్‌ తికాయత్‌ డిమాండ్‌ చేశారు. తాను కూడా వ్యాక్సిన్‌ వేయించుకుంటానని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఇక్కడ ఉద్యమిస్తున్న వారందరికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఇవ్వాలని గురువారం తికాయత్‌ డిమాండ్‌ చేశారు.

రైతుల ఆందోళన నేపథ్యంలో పలువురు నిరసనకారులు కరోనా వైరస్ మహమ్మారి ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కేవలం 3.5 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగా 5.74 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను 72 దేశాలకు సరఫరా చేశారు. మరోవైపు మన దేశ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు పంపబోమని ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ భరోసా ఇచ్చారు.