క్రిష్‌ డైరెక్షన్‌లో వైష్ణవ్ తేజ్ హీరోగా ”కొండ పొలం”

ఉప్పెన సినిమా తో టాలీవుడ్ లో తెరంగ్రేటం చేసిన మెగా హీరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమా పూర్తి కాగానే తదుపరి ప్రాజెక్టు తో రెడీ అయిపోయాడు ఈ మెగా హీరో. వైవిధ్యమైన దర్శకుడిగా పేరుగాంచిన క్రిష్‌ జాగర్లమూడి డైరెక్షన్‌లో మెగా థ్రిల్లర్‌ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో బిజీ అయిపోయాడు. ఇందులో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. కోవిడ్ నేపథ్యంలో ఎటువంటి హంగామా లేకుండా మొదలైన ఈ సినిమా కేవలం 45 రోజుల్లోనే చిత్రీకరణను పూర్తిచేసుకుంది.

అడవి నేపథ్యంలో సాగే చిత్రమిది. ఒక ప్రముఖ నవల ఆధారంగా చేసుకొని రూపొందినట్టుగా సమాచారం. ఈ సినిమాలో రకుల్‌ పల్లెటూరి అమ్మాయి పాత్రలో డీ గ్లామరస్ గా కనిపించనున్నారు. హీరో వైష్ణవ్ తేజ్ కూడా అదే తరహాలో దర్శనమివ్వనున్నారు. కాగా పల్లెటూరు వాతావరణం కనబరిచే ఈ చిత్రానికి ”కొండ పొలం” అనే సరికొత్త టైటిల్ ను సెలెక్ట్ చేసినట్లు సినీ వర్గాల నుంచి అందిన సమాచారం. పలు క్రేజీ ప్రాజెక్టులు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన విభిన్న దర్శకుడు క్రిష్…ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్ కు గొప్ప విజయాన్ని అందించనున్నారని అభిమానులు భావిస్తున్నారు. అటు… కాస్త గ్యాప్ తీసుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన మూవీ విడుదల కాకముందే మరో సినిమాను తెరకెక్కకించడం గొప్ప విషయమే.