‘రౌడీ’ హీరో విజయ్ కు థ్యాంక్స్ చెప్పిన బన్నీ

విజయ్‌ దేవరకొండ ‘రౌడీ’ పేరుతో దుస్తుల బ్రాండ్‌ని కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో స్టైల్ ఐకాన్ గా నిలిచిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ..రౌడీ హీరో విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ కు పెద్ద ఫ్యాన్.  విజయ్‌ స్టైల్‌ తనకి బాగా నచ్చిందని.. ‘రౌడీ’ బ్రాండ్‌ దుస్తులు అడిగానని అల్లుఅర్జున్‌ ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. దీంతో విజయ్‌ ఆయన కోసం ప్రత్యేకంగా కొన్ని దుస్తులు డిజైన్‌ చేసి పంపించారు కూడా.

అయితే తాజాగా విజయ్‌ దేవరకొండ మరోసారి స్టైలిష్ స్టార్ కోసం రౌడీ బ్రాండ్ నుంచి థిక్ బ్లూ కలర్ లో రౌడీ క్లబ్ సింబల్ ప్రింట్ చేసిన ఓ న్యూ స్టైల్ లాంగ్ స్లీవ్ టీషర్ట్ అండ్ ప్యాంట్ ని పంపించాడు.  డ్రెస్ ని వేసుకున్న బన్నీ ఆ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ కూల్ పెయిర్ ని నా కోసం పంపించినందుకు బ్రదర్ విజయ్ దేవరకొండకు… అండ్ అతని టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నాను. కూల్ కంఫర్ట్..లవ్ లీ షైన్ బ్రదర్` అంటూ బన్నీ కామెంట్ చేశాడు.