కొమరాడ జనసేన గ్రామశాఖ అధ్యక్షునిగా వలవల వెంకటేశ్వరావు

  • జనసేన పార్టీ నూతన గ్రామశాఖ అధ్యక్షుని ఎంపిక

రాజోలు నియోజకవర్గం: మామిడికుదురు మండలం, కొమరాడ గ్రామంలో మామిడికుదురు మండల ఉపాధ్యక్షులు దొడ్డ జైరామ్ అధ్యక్షతన జరిగిన జనసేన పార్టీ గ్రామసభ సమావేశంలో జనసేన పార్టీ కొమరాడ గ్రామశాఖ అధ్యక్షునిగా వలవల వెంకటేశ్వరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జనసేన-తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు గారు ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామంలో రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం అధికారం చేపట్టే విధంగా ఎలా పనిచెయ్యాలో గ్రామ ప్రజలకు తెలియచేసారు. ఈ సందర్భంగా కొమరాడ గ్రామ ప్రజలు వలవల వెంకటేశ్వరావుకి శుభకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో అల్లు సురేష్, గోగి గోపి, బొంతు సుధాకర్, గుల్లిక గంగాదర్, పాలూరి పద్ధరాజు, రుద్ర శ్రీను, ఏరుబండి బాబాలు, వలవల గంగాధర్, వలవల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ధినేని బాబ్జీ మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.