నూతన దంపతులను ఆశీర్వదించిన వంగ లక్ష్మణ్ గౌడ్

వనపర్తి జిల్లా, గోపాలపేట మండలం, ఏదుల గ్రామంలో జనసేన పార్టీ కోసం కష్టపడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు పార్టీ సిద్ధాంతాలు బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వనపర్తి జిల్లా నాయకులు కోడిగంటి సాయి వివాహానికి విచ్చేసి దంపతులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు రేచర్ల శేఖర్, పాలమూరు నియోజకవర్గ నాయకులు పిఆర్ రాఘవేంద్ర, వనపర్తి నియోజకవర్గ నాయకులు ఎంరెడ్డి. రాకేష్ రెడ్డి, బారీగారి రాజేందర్, కిరీటి గౌడ్, సూర్య, జెర్రీపార్టీ చంద్రశేఖర్, శ్రీకాంత్, కళ్యాణ్, పవన్, లింగంనాయక్, నరసింహ, లక్ష్మీనారాయణ, చందు, శివ, గౌరవ్ తదితరులు విచ్చేసి ఆశీర్వదించడం జరిగింది.