బల్లిపర్రు గ్రామంలో ఘనంగా వంగవీటి మోహన్ రంగా జయంతి

పెడన మండలం, బల్లిపర్రు గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతిని పురస్కరించుకుని బల్లిపర్రు గ్రామస్తులు, రంగా అభిమానులు, జనసేన పార్టీ నాయకులు ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వంగవీటి మోహన రంగా ఈ పేరు వింటే చాలు కాపు, బడుగు, బలహీన వర్గాలు, బహుజనులు, పేదలు రెండు చేతులు జోడించి ఆరాధన భావంతో వందనాలు చేస్తూ జోహార్లు అర్పిస్తారు. మడమ తిప్పని పౌరుషంతో ఆత్మగౌరవ పోరాటాన్ని సాగిస్తూ పేద ప్రజలకు బాసటగా నిలిచి వారి రక్షణ కోసం గాంధీయ మార్గంలో అమర నిరాహార దీక్ష ఉద్యమం చేస్తూ 1988 డిసెంబర్ 26న రాజకీయ కుట్రకు బలైపోయారు. కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ గారు మరణించే నాటికి ఆయన వయసు 41 సంవత్సరాలు ఎంతకాలం జీవించావు అన్నది ముఖ్యం కాదు. ప్రజల గుండెల్లో ఎంత స్థానం సంపాదించామన్నది ముఖ్యం. మరణించి 34 సంవత్సరాలు అయినా ఎప్పటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వంగవీటి మోహన రంగా చిరస్మరణీయుడు.