విశాఖపట్నంలో వారాహి విజయ యాత్ర

  • యాత్ర విజయవంతంపై విశాఖ నాయకులతో సన్నాహక సమావేశం

మంగళగిరి నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర తదుపరి విడత విశాఖపట్నం నగరం నుంచి మొదలవుతుంది. ఈ యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా సాగింది. అంతకు మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలి. నాయకులు, వీరమహిళలు, జనసైనికులు అంతా సమష్టిగా పని చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలి. యాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమం విశాఖలో ఉంటుంది. అదే విధంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టి, సంబంధిత ప్రజలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశమై సమస్యలను తెలుసుకుంటారు” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, రాష్ట్ర అధికార ప్రతినిధులు సుందరపు విజయకుమార్, పరుచూరి భాస్కర రావు, పార్టీ నేతలు గడసాల అప్పారావు, శ్రీమతి అంగ దుర్గా ప్రశాంతి, బోడపాటి శివదత్, శ్రీమతి పి.ఉషాకిరణ్, పంచకర్ల సందీప్, పి.వి.ఎస్.ఎన్.రాజు, వంపూరు గంగులయ్య, పంచకర్ల రమేశ్, డా. బొడ్డేపల్లి రఘు, శ్రీమతి వసంత లక్ష్మి, మూర్తి యాదవ్, దల్లి గోవింద రెడ్డి, కందుల నాగరాజు, తోట సత్యనారాయణ, కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.