వారాహి యాత్ర విజయవంతం కావాలి..

  • పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి..
  • దుష్ట శక్తుల పన్నాగాలు పతనం కావాలి
  • శ్రీ సర్వ మంగళా దేవి ఆలయం, ప్రసన్నాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: జనసేనాని కొణిదల పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీ బుధవారం నుండి చేపడుతున్న వారాహి యాత్ర విజయవంతం కావాలని, పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులు మంగళవారం పార్వతీపురం పట్టణంలోని దుర్గ గుడి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ సర్వ మంగళా దేవి ఆలయంలోనూ, కొత్తవలసలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ జిల్లా నాయకులుచందక అనిల్, వంగల దాలినాయుడు, రాజాన రాంబాబు, సురేష్ నెయ్యిగాపుల, సిరిపురపు గౌరీ, సీతానగరం మండల అధ్యక్షులు పాటి శ్రీనివాసరావు, మానేపల్లి ప్రవీణ్, ఖాతా విశ్వేశ్వరరావు, సిరిపురపు చైతన్య, కొల్లేపర తేజ, కునుకు రమేష్, బూరగాన సాయి, తాడ్డి వినయ్, కడగల లింగ తదితరులు శ్రీ సర్వమంగళ దేవి ఆలయంలో వారాహి యాత్ర దిగ్విజయం కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొత్తవలసలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ దేవాలయంలో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ సాంప్రదాయ బద్ధంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర బాగు కోసం తమ జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నీ త్యాగం చేసి ప్రజల కోసం పాటుపడుతున్నారన్నారు. వారాహి యాత్ర చేపట్టి రాష్ట్రం అధోగతి పాలైన విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయన్నారు. ఆ దుష్టశక్తుల పన్నాగం పతనం కావాలని ప్రార్థించారు. ఆంధ్ర రాష్ట్రానికి కొణిదల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని భగవంతుని ప్రార్థించారు. జనసేనాని ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అప్పులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడంతోపాటు బడుగు, బలహీన, మహిళా, నిరుద్యోగ వర్గాలకు సంక్షేమాన్ని అందజేస్తారన్నారు. అవినీతి అన్యాయాలకు తావు లేని పాలన అందిస్తారన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తన జీవితాన్ని త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ ను ప్రజలు రానున్న 2024లో ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా దీవించాలని కోరారు. ఈ సందర్భంగా వారు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొన్నారు.