జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాతృమూర్తి అంజనా దేవి జన్మదిన సందర్భంగా నర్సీపట్నంలో పలు సేవా కార్యక్రమాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాతృమూర్తి అంజనా దేవి జన్మదిన సందర్భంగా నర్సీపట్నంలో “అంజనా దేవి చారిటబుల్ ట్రస్ట్” వారి ఆధ్వర్యంలో నర్సీపట్నం నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ రాజన్న వీర సూర్య చంద్ర మరియు సేవా ట్రస్ట్ అధ్యక్షులు పెనుపోతుల నాగు చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజ కార్యక్రమం, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు పండ్లు, బ్రెడ్ ఏరియా హాస్పిటల్ డాక్టర్ ల పర్యవేక్షణలో పంపిణీ చేశారు. తదుపరి పెద్ద బొడ్డేపల్లిలో ఉన్నటువంటి నిరాశ్రయుల ఆశ్రమంలో ఉన్నటువంటి నిరాశ్రయులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు పంపిణీ, ఎంపిపి స్కూల్ లో పుస్తకాలు, పెన్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, రూరల్ అధ్యక్షులు ఊడి చక్రవర్తి, జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.