యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న వాసగిరి మణికంఠ

  • పాత గుంతకల్ యువతకు మూడు క్రికెట్ బ్యాట్లు పంపిణీ
  • క్రీడలతోనే యువతలో స్నేహభావం పెరుగుతుంది

జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణం, పాతగుంతకల్ కు చెందిన యువత కోరిక మేరకు ఆదివారం వాసగిరి మణికంఠ వారి సౌజన్యంతో మూడు క్రికెట్ బ్యాట్లను స్థానిక యువతకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలని అనంత జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడాకారులు ఎన్నో రకాల ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారిణిల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. దీంతో చాలామంది మహిళా క్రీడాకారులు క్రీడలకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలన్నారు. అలా జరగాలంటే యువతి, యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. క్రీడలతో ముఖ్యంగా నాయకత్వం లక్షణాలను, గెలుపోటములను తట్టుకునే శక్తి మరియు ఆరోగ్యం, మానసికోల్లాసంతోపాటు పాటు స్నేహభావం పెంపొందుతుందని తెలిపారు. కార్యక్రమం అనంతరం వాసగిరి మణికంఠ ను యువకులు ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, గుంతకల్ పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్ సీనియర్ నాయకులు గాజుల రాఘవేంద్ర, అమర్ పాతగుంతకల్ యువకులు మధు, మనోజ్, రమణ, సూరి, ప్రతాప్, అల్లు మధు, చిరు, మస్తాన్, అనిల్, శీనా, హరి, మహేష్, గణేష్ తదితరులు, పెద్ద ఎత్తునయువకులు పాల్గొన్నారు.