జనసేన పార్టీ ప్రచార స్టిక్కర్లను ఆవిష్కరించిన వాసగిరి మణికంఠ

గుంతకల్, ఓటు ఖరీదు నోటు కాదని, మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని గుర్తించుకో ఓటరన్నా!! అనే ప్రజల్ని చైతన్య పరిచే జనసేన పార్టీ పోస్టర్లను వాసగిరి మణికంఠ ఆవిష్కరించి పట్టణంలోని ఆటోలకు, బైకులకు, గోడలకు నిస్వార్థ జనసైనికుల సహకారంతో అతికించిన అనంతరం వాసగిరి మణికంఠ మాట్లాడుతూ జనసేన అధినేత పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన, కౌలు రైతుల సంక్షేమం కోసం ఆయన ప్రారంభించిన కౌలు రైతుల భరోసా యాత్ర మరియు కార్యకర్తల కోసం ఆయన తీసుకువచ్చిన క్రీయాశీలక సభ్యత్వం (5 లక్షల ప్రమాదభీమా) లాంటి కార్యక్రమాలను ప్రజలందరికీ తెలియజేసే విధంగా అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన – తెలుగుదేశం పార్టీల ప్రభుత్వ ఏర్పాటే ధ్యేయంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, సీనియర్ నాయకులు కసాపురం నందా, సుబ్బయ్య, కథలగేరి అంజి, పామయ్య, రమేష్ రాజ్, ధనుజయ్ మైనార్టీ నాయకుడు దాదు నిస్వార్థ జనసైనికులు అమర్, అనిల్ కుమార్, లారెన్స్, సత్తి, మంజు పరుశురాం, డోసులుడికి మల్లి తదితరులు పాల్గొన్నారు.