అనంత అభివృద్ధి ఎక్కడ?: అంకె ఈశ్వరయ్య

అనంతపురం: నాలుగున్నర సంవత్సరముల వైసీపీ ప్రభుత్వంలో అనంత అభివృద్ధి శూన్యమని అనంతపురం ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలను విమర్శించడం సిగ్గుచేటని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య మండి పడడం జరిగింది. మంగళవారం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ అనంతపురం అర్బన్ పరిధిలోని ప్రజా సమస్యలు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారికి కనిపించేటట్లుగా వసీమ్ గారు కంటి అద్దాలను ఇస్తే బాగుంటుందని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య హితవు పలికారు. అనంతపురం అభివృద్ధి చెందిందని భ్రమలు పడుతున్నటువంటి వైసీపీ నాయకులకు ఒకసారి డివిజన్ స్థాయిలో మీరు పర్యటించండి ఆ డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను ఒకసారి తెలుసుకోండి, జనసేన పార్టీ నుండి అర్బన్ ఇంచార్జ్ టిసి వరుణ్ అనంతపురం అర్బన్ పరిధిలో ఉన్నటువంటి 50 డివిజన్లో రోడ్ల పరిస్థితిని శ్రమదాన కార్యక్రమం ద్వారా గుంతల మైనటువంటి రోడ్లను గుంతలు పూడ్చే కార్యక్రమం ద్వారా నిరసన కార్యక్రమాలు చేపట్టి నిద్రపోతున్నట్టు నటిస్తున్నటువంటి మిమ్మల్ని నిద్ర లేపాము. అకాల వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినప్పుడు వారికి సహాయ కార్యక్రమాలలో పాలుపంచుకున్నది జనసేన పార్టీ కదా?
వైసీపీ నాయకులు అకాల వర్షాలకు నీటి మునిగినటువంటి అనంతపురం ప్రజానీకానికి ఆరోజు ఆక్రమణలకు గురి అయినటువంటి నడిమి వంక ప్రధాన కాలువను సరిచేసి, మరమ్మత్తు లు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తానని చెప్పినటువంటి హామీ ఈరోజు వరకు కూడా ఎమ్మెల్యే అనంత నెరవేర్చలేదు. చెరువు కట్టకు సమీపాన గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పార్క్ ని ఉపయోగించకుండా నిరుపయోగం చేసినటువంటి ప్రభుత్వం మీరు కదా? ఎందుకు మీ ప్రభుత్వ హయాంలో ఆ పర్కుని అభివృద్ధి చేయలేకపోయారు?అనంతపురంలోని డంపింగ్ యార్డ్ ని ఎందుకు అక్కడి నుంచి తరలించలేకపోయారు? అనంతపురం పట్టణానికి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఎందుకు తీసుకురాలేకపోయారు? అనంతపురం అర్బన్ పరిధిలో ఉన్న నిరుద్యోగ యువతకి ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పించారు? కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే పథకం ద్వారా బళ్లారి బైపాస్ నుండి పంగల్ రోడ్డు వరకు మధ్యలో టవర్ క్లాక్ బ్రిడ్జిని నిర్మిస్తే ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి గారు తమ సొంత నిధులతో రోడ్లు వేసినట్లుగా గొప్పగా చెప్పుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం తమ సొంత నిధులతో ఏ రోడ్డు వేశారో చూపించగలరా? ఈ వైసీపీ ప్రభుత్వంలో అనంతపురంలో అభివృద్ధిని వెతకడం మూర్ఖత్వమే అవుతుంది అని జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య ఘాటుగా విమర్శించారు.