విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని వీరఘట్టం జనసేన డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండె లాంటిది విశాఖ ఉక్క పరిశ్రమ అని, 32 మంది ప్రాణ త్యాగాల తో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా పార్లమెంట్ లో ప్లకార్డులు ప్రదర్శించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని , మిమ్మల్ని గెలిపించినందుకు ప్రజల తరఫున పోరాడండి అని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేసిన వీరఘట్టం మండలం నాయకులు మత్స పుండరీకం. జనసేన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గఒ, వీరఘట్టం మండలం నాయకులు మత్స పుండరీకం, వజ్రగడ్డ రవికుమార్(జాని), రౌతు కిరణ్, చింత గోవర్ధన్ మరియు తోటి జనసైనుకులతో కలిసి నడుకురు, విక్రమపురం, వీరఘట్టం, బొడ్లపాడు, కిమ్మి, తదితర గ్రామాల్లో ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేయటం జరిగింది.