ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు @ 43 ఇయర్స్ పాలిటిక్స్

ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రజా జీవితంలోనికి ప్రవేశించి నేటికి సరిగ్గా 43 ఏళ్లయ్యింది. రాజకీయ జీవితంలో మరకలేని మనిషిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తొలి సారిగా ఆయన ఫిబ్రవరి 25, 1978న జనతా పార్టీ అబ్యర్థిగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 28 ఏళ్ల పిన్న వయస్సులోనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన విద్యార్థి నేత నుంచి చట్టసభకు వెళ్లారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపిగా, కేంద్ర మంత్రిగా రెండు పర్యాయాలు నిస్వార్ధంగా ప్రజా సేవ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా పార్టీ పురోభివృద్ధికి, పటిష్టతకు చిత్తశుద్ధితో కృషి చేశారు. ఆయన నిరాడంబరత, నిస్వార్థ సేవే ఆయనకు పదవులను తెచ్చి పెట్టింది. ప్రస్తుతం దేశంలో రెండు అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతిగా కొనసాగుతున్నారు.