జనసేనలో చేరిన వెంకటనగరం గ్రామ మహిళలు

పాయకరావుపేట మండలం వెంకటనగరం గ్రామ మహిళలు జనసేనపార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై టీడీపీ పార్టీ నుంచి మాజీ మహిళా మండలి ప్రెసిడెంట్ వంకా కొడమ్మతో పాటుగా 30 మంది మహిళలను సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మీకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చిన అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని గెడ్డం బుజ్జి వారికి భరోసా కల్పించారు.