వెంకటేశ్వరరావు అండగా ఐనాబత్తిన రాజేష్

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, సోమరాజు పల్లి పంచాయితీ, నర్రవారిపలెం వైపు పోవు రహదారిపై రైల్వే డిపార్ట్మెంట్ వారు ఆ గ్రామ ప్రజలను అడగకుండా మూడవ లైను కోసం మంచి నీటి పైపులు మీదుగా గ్రావెల్ తోలి, ఆ గ్రామ ప్రజల రాకపోకలకు, మంచి నీటి సరఫరాకు, తీవ్రమైన ఇబ్బందులకు గురవడం జరిగుతుంది. వైసీపీ ప్రభుత్వంలో పేదవాళ్ళకు అన్యాయం జరగడం మామూలే కాబట్టి ఆ గ్రామ ప్రజలు జనసేన పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ని కలిసి వాళ్ళ బాధను తెలియజేయగా వెంటనే స్పందించి గ్రామ ప్రజలతో ఎమ్మార్వోని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రోడ్ లేకపోతే వర్షాకాలంలో రాకపోకలు లేకపోగా ఎలాంటి సహాయ సహకారాలు అందక గ్రామప్రజలు అల్లాడిపోతారు. అంతేకాకుండా సర్వే నంబర్ 594/సి 2 భూస్థితి వరద వెంకటేశ్వరరావు మూడు సెంట్లు భూమిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రైల్వే, రెవెన్యూ అధికారులు గ్రావెల్ తోలి తనని ఇబ్బంది పెట్టడం జరిగితే, ఎమ్మార్వోకి చెప్పిన వెంటనే స్పందించి వాళ్లకు, రైల్వే వారితో మాట్లాడి న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ కేశవరావు, జనసైనికులు పాల్గొన్నారు.