మిమ్మల్ని మీరు రక్షించుకోండి.. మహేష్‌బాబు డైలాగులతో తెలంగాణ పోలీసుల వీడియో

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న వేళ, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడంపై రాష్ట్ర పోలీసులు వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు. మాస్క్ ధరించి ఉన్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు ఫోటోను పోస్ట్ చేస్తూ, ఓ వీడియోను విడుదల చేశారు. మాస్కుల ప్రాధాన్యతను వివరించేలా ఉన్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. “జీవితం అనేది ఓ యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్‌లో పడేశాడు. అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి” అంటూ మహేష్ డైలాగులు కూడా ఇందులో వినిపిస్తున్నాయి. ఈ వీడియోను మీరు కూడా చూడవచ్చు.