డా.ఘంటసాల వెంకటలక్ష్మి సారధ్యంలో కొల్లేరు పాట వీడియో విడుదల

దెందులూరు: జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొల్లేరు నాయకురాలు డా.ఘంటసాల వెంకటలక్ష్మి సారధ్యంలో ప్రజా గాయని, సామాజిక ఉద్యమ కారిణి, అరుణోదయ కామ్రేడ్ విమలక్క పాడిన కొల్లేరు పాట వీడియో ప్రోమో మరియు కొల్లేటి పాట పూర్తి వీడియో విడుదల మరియు కొల్లేరుకి సంభందించిన సమావేశానికి సంభందించిన కరపత్రాన్ని కొల్లేరు ప్రాంతానికి చెందిన శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతావాది, సాహితీ వేత్త,’కొల్లేరు ప్రజల వేదిక’ కన్వీనర్ చింతపల్లి వెంకటనారాయణ, కొల్లేరు ప్రాంత నాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, బలే చంటి, ముంగర నరసింహారావు, సర్రాజు, మోరు సుబ్రహ్మణ్యం, సైదు కామేశ్వరరావు, మోరు వెంకటనాగరాజు కొల్లేరు యువ నాయకులు జయమంగళ దొరబాబు, మోరు భరత్ రామ్ తదితరులు పాల్గొన్నారు.