శుభవార్త చెప్పిన విద్యుల్లేఖ

లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్‌ తనదైన నటనతో మంచి పేరు తెచ్చుకుంది… రాజు గారి గది, మహర్షి, వెంకీ మామ మొదలైన చిత్రాలు ఆమెకి మంచి పేరును తీసుకువచ్చాయి.. అయితే సినిమాల్లో ఎక్కువగా బొద్దుగా కనిపించే విద్యుల్లేఖ తాజాగా బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. జూన్ 20 నాటికి ఆమె 68.2 కేజీలకి చేరుకుంది. ఇది ఇలా ఉండగా అభిమానులకి శుభవార్తను వెల్లడించింది. త్వరలో తానూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టుగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది విద్యుల్లేఖ. ఆగస్టు 26న తమ ఎంగేజ్‌మెంట్ జరిగిందని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

తనకి కాబోయే భర్త ఫోటోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణుడైన సంజయ్‌తో ఆమె వివాహం జరగనుంది. తాజాగా ఆగస్టు 26 న రోకా ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు పేర్కొంది. కరోనా నిబంధనలకు లోబడి నిశ్చితార్థం అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు,సన్నిహితుల మధ్య జరిగిందన్నారు. తాము మాస్కులు వేసుకుని ఫోటోల కోసం వాటిని తీసేసి మళ్లీ వేసుకున్నామని చెప్పింది.