అందరినీ ఆశ్చర్యపరిచిన విజయ్‌

బాలు గారి మృతి పట్ల యావత్‌ సినీ, సంగీత ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ క్రమంలో  కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ ఎస్పీ బాలు గారి అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు జరుగుతుండగా విజయ్ అక్కడకు చేరుకున్నారు. బాలు కుమారుడైన ఎస్పీ చరణ్ ని ఆయన కలిసి సంతాపం వ్యక్తం చేశారు. అత్యక్రియలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక బాలు పార్థివ దేహాన్ని ఆయన దర్శించి.. బాలుగారికి విజయ్ నివాళులు అర్పించారు. బాలు అకాల మరణానికి విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో విజయ్‌ని చూసిన అభిమానులు  ఆయనని చుట్టుముట్టారు. పోలీసుల సహకారంతో అక్కడ నుండి క్షేమంగా బయటపడ్డాడు.

బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు విజయ్ హాజరైన సమయంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. విజయ్‌ని సేఫ్‌గా తీసుకెళ్ళేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. అయితే పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఓ అభిమాని చెప్పు జారవిడుచుకున్నాడు. అది చూసిన విజయ్ తన చేతితో చెప్పుని తీసి అభిమానికి అందించబోయాడు. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.