పెద్దబొండపల్లి గ్రామంలో జనసముద్రం మధ్య విజయచంద్ర పర్యటన అదుర్స్

పార్వతీపురం మండలం, పెద్దబొండపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే పార్వతీపురం నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం, బిజెపి ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన బోనెల విజయ చంద్ర రాకతో సందడి వాతావరణం నెలకొంది. జనసేన, టిడిపి, బిజెపి, జెండాలతో కళకళలాడిన పెద్దబొండపల్లి భారీగా చేరుకున్న జనసేన-టిడిపి- బిజెపి కార్యకర్తలు నాయకులు, ఇంటింటికీ వస్తున్న విజయ్ చంద్ర గారికి నినాదాలతో డప్పులు ,వాయిద్యాలతో మహిళలు ప్రజానీకం పూల మాలలు వేసి విజయ తిలకం దిద్ది మంగళ హారతులు పడుతున్న పెద్దబొండపల్లి గ్రామం ప్రజానీకం, చంద్రబాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో అంశాలను ప్రజానీకానికి వివరిస్తుా ముందుకు నడిచిన విజయ చంద్ర ఈ కార్యక్రమంలో జనసేన, మండల అధ్యక్షురాలు ఆగూరు మని, పురుషోత్తం, చిన్నారావు, అన్న బత్తుల దుర్గాప్రసాద్, సంతు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, చిట్లు గణేశ్వరరావు, విశ్వేశ్వరరావు, కనకరాజు, భాస్కర, జనసేన కార్యకర్తలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.