గొప్ప మనసు చాటుకున్న విరాట్ కోహ్లి

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన గొప్ప మనసు చాటుకున్నారు. 10 వేల మంది చిన్నారులకు పోషణకు అయ్యే ఖర్చును భరించబోతున్నాడు. తాజాగా ‘వైజ్’అనే సానిటైజర్ సంస్థతో బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం కుదుర్చుకున్నాడు. మహారాష్ట్రలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు అపన్నహస్తం అందించాడు. వారి కోసం ‘రా ఫౌండేషన్’తో చేతులు కలిపాడు. ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నందుకు గర్వపడుతున్నానని విరాట్ తెలిపాడు.ఇలాంటి గొప్ప పని భాగం అయినందుకు గర్విస్తున్నా.. ‘వైజ్’ సంస్థ ద్వారా దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారికి సాయంగా అందిస్తున్నాను. క్రీడాకారులకు మీరు అందించే ప్రేమానురాగాలే పెద్ద ఆస్తి. కానీ ఇప్పటిపరిస్థితులలో కోవిడ్-19 వారియర్సే అసలైన హీరోలు. వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. ఇలా వైజ్‌తో ఒప్పందం చాలా ఆనందాన్ని విషయమన్నారు కోహ్లి

కరోనా వైరస్ కట్టిడి గతంలో తమ వంతు సాహయాన్ని ప్రకటించారు విరుష్కా జోడీ. ఎంత సహాయం చేశారన్న విషయం గొప్యంగా ఉంచి నప్పటికి మహారాష్ట్ర సీఎం నిధికి, పీఎంకేర్స్‌కు కలిపి రూ.3 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో బిజీగా ఉన్న కోహ్లీ సహచర ఆటగాళ్ళతో కలిసి ప్రాక్టీస్‌లో మునిగితెలుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇండియాకు తిరిగి రానున్నారు. ఆసీస్‌తో తొలి టెస్ట్ ముగిశాక అతను స్వదేశానికి పయనమవుతాడు. విరాట్ సతిమణి అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతి. ఆమెకు జనవరిలో డెలివరీ టైం ఉంది. ఇక రెండు నెలలపాటు ఈ సుదీర్ఘ పర్యటన కొనసాగునుంది. తొలి టెస్టు అడిలైడ్‌లో డిసెంబర్‌ 17 నుంచి 21 వరకు జరగుతుంది. ఈ టెస్ట్ తర్వాత కోహ్లి భారత్‌కు తిరిగి వస్తాడు.