విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మార్మోగిన రాజోలు జనసేన

తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గం మలికిపురం ఎంపీపీ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాజోలు శ్రీవనువులమ్మ దేవాలయం కూడలిలో జనసేన నాయకులు రేకపల్లి సురేష్ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు పేరిట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని ప్లకార్డులతో డిజిటల్ నిరసన తెలియచేశారు. దీనికి సంఘీభావంగా మలికిపురం మండల అధ్యక్షులు శ్రీమతి మేడిచర్ల సత్యవాణి రాము, బి.సావరం ఉపసర్పంచ్ రావూరి నాగబాబు, జనసేన సీనియర్ లీడర్ గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, కుంచే శ్రీనివాసరావు(పండు జనసేన), గుల్లింకగంగాధర్, నంద్యాల సూర్య, రావూరి తేజ, బోళ్ల రాజేష్ మరియు స్థానిక వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ తక్షణమే నిలిపివేయాలని ఆంధ్ర వైసిపి ఎంపీలకు సూచనలు తెలిపారు. పార్లమెంట్లో ప్లకార్డ్స్ ప్రదర్శించాలని మరొకసారి విజ్ఞప్తి చేశారు.