సొంత రాష్ట్రంలో సరిఅయిన ఉపాధి లేక పరాయి దేశంలో దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షుగా మా బ్రతుకులు ఈడుస్తున్నాము

జనసేన పార్టీ అధినేత ఇచ్చిన ఒక్క పిలుపుతో ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో తాము ఉన్న దేశంతో పనిలేకుండ స్వదేశంలో సొంత రాష్ట్రంలో ఉక్కు కర్మాగార కార్మికులు రోడ్డున పడే పరిస్తితి దాపరించిందని దైర్యంగా రోడ్లమీదకు వచ్చి #సేవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ అని రాజోలు నియోజకవరర్గానికి చెందిన మట్టపర్రు గ్రామ వాసి తోరం రామకృష్ణ కువైట్ నుండి @అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధకి నిరసన తెలియచేశారు. దేశం ఏదైనా సైనికుడి గుండెధైర్యం జనసేనాని అని తోరం రామకృష్ణ ఈ సందర్భంగా అన్నారు.