చింతలపాడు, వందనపల్లిలో జనసేన నాయకుల పర్యటన

అల్లూరీ సీతారమరాజు జిల్లా, జి.మాడుగుల మండలం, వంజరి పంచాయితీ గ్రామాలైన చింతలపాడు, వందనపల్లి గ్రామాలలో జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ నిర్వహించే యువగళం కార్యక్రమంలో భాగంగా అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య మరియు జనసేన పార్టీ లీగల్ ఇన్చార్జ్ కిల్లో రాజన్, మండల అధ్యక్షులు మసాడి భీమన్న గ్రామపర్యటన చేసారు. ఈ సందర్బంగా డా. గంగులయ్య ఆదివాసీ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ఆదివాసీ ప్రజలను మోసం చేయడంలో రెండు ప్రధాన పార్టీలు అందెవేసిన చెయ్యిగా మనం చెప్పుకోవచ్చు. గిరిజన ప్రజలు నేటికి డోలిమోతలతో నిత్యం దుర్భరమైన కష్టాలను చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. మౌళిక సదుపాయాలు కల్పన విషయంలో ప్రభుత్వం పూర్తిగా విపలమయ్యింది. రాష్ట్రమంతా ఆర్థిక సంక్షోభంలో నెట్టేసింది. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించి ఈ రోజున గ్రామీణాభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు విషయంలో పూర్తిగా విరుద్ధమైన బోయవాల్మీకి కులస్తులకు ఎస్.టి జాబితాలో చేర్చాలని తీర్మానం చెయ్యడం ఎంతవరకు సబబు? మన గిరిజనులు అన్నివిధాలుగా ఆర్ధిక, విద్య వంటి రంగాల్లో వెనకబడి ఉన్నాం కానీ మనకంటే అన్ని రంగాల్లో ముందున్న ఒక కులస్తులకు ఎస్.టి జాబితాలో చేర్చడం వంటి ఆలోచన చెయ్యడానికి గల కారణాలు ప్రభుత్వం ఏ రకమైన కుట్ర, కుతంత్రాలు పన్నుతుందో గిరిజన ప్రజలు ఆలోసించాలని తెలిపారు. అలాగే ఇంటింటా స్టిక్కర్ గ్యాంగ్లు తిరుగుతున్నాయని ఏ గ్రామానికి వచ్చిన వాళ్ళని నిలదీయాలని, సమస్యలపై ప్రశ్నించనప్పుడు ప్రజాస్వామ్యానికి విలువెక్కడుంటుందని? అందుకే ప్రశ్నించే తత్వమున్న పవన్ కళ్యాణ్ రాజకీయ మార్పు కోరి జనసేన పార్టీ స్థాపించారని, బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలుస్తారని అన్నారు. జనసేన పార్టీ లీగల్ ఇన్చార్జ్ కిల్లో రాజన్ మాట్లాడుతూ.. ప్రజాచైతన్య ఉద్యమాల నుంచి పుట్టిన వ్యక్తి గంగులయ్యగారని, అటువంటి వ్యక్తి కచ్చితంగా మంచి చేస్తారని అందుకే అన్ని గిరిజన ఉపకులాలు నుంచి యువత గంగులయ్యగారికి అండగా ఉన్నామని కచ్చితంగా జనసేన పార్టీ గెలుపుకు కృషి చేస్తామని, ఆధివాసి ప్రజలకు వారి మాతృభాష కువి భాష లోనే మాట్లాడి ఉత్తేజపరిచారు. ఈ యువగళం కార్యక్రమం గ్రామ పర్యటనలో డా. గంగులయ్యతో పాటు లీగల్ ఇన్చార్జ్ కిల్లో రాజన్, జి.మాడుగులమండల అధ్యక్షులు మసాడి భీమన్న, చింతపల్లి మండల అధ్యక్షులు వంతల బుజ్జిబాబు, జనసేన పార్టీ ఐటి ఇన్చార్జ్ సాలేబు అశోక్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా పార్టీ సిద్ధాంతాలు నచ్చి గ్రామ పెద్దలు చంటి, రంగారావు, అప్పారావు, అర్జున్, ప్రకాష్, సతీష్, అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ గంగులయ్య చేతుల మీదుగా కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఈ చేరికలలో విశేష కృషిచేసిన కిల్లో రాజన్ గారికి అభినందనలు తెలియజేశారు.