Vizag: జనసేన జెండాలతో విశాఖ కళకళ

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తమ పోరాటానికి అండగా ఉండాలని, సభలో పాల్గొనవలసిందిగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు అక్టోబరు 31వ తేదీన శ్రీ పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి వెళ్ళి పరిరక్షణ సమితి ప్రతినిధులను కలసి వారు నిర్వహించే సభలో పాల్గొంటారు. అయితే ఈ సభకు వెదిక ఇప్పతికే సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ కు, జనసేన నాయకులకు, శ్రేయోభిలాషులకు మరియు జనసైనికులకు స్వాగతం పలుకుతూ విశాఖ విమానాశ్రయం నుంచి కూర్మన్నపాలెం సభా వేదిక వరకు రోడ్లకు ఇరువైపులా జనసేన జెండాలతో కిక్కిరిసిన రోడ్లు కళకళలాడుతున్నాయి.