సర్వమత ప్రార్థనలు నిర్వహించిన విజయనగరం జిల్లా చిరంజీవి యువత

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో నాలుగో రోజు సర్వమత ప్రార్థనలు

విజయనగరం జిల్లా చిరంజీవి యువత &అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం ఆధ్వర్యంలో నిర్వహణ

విజయనగరం: పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లోని భాగంగా శనివారం ఉదయం విజయనగరం జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపకడు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో కోట వద్దఉన్న డంకే షావలీ బాబా దర్గా లోని, హనుమాన్ జంక్షన్ వద్దనున్న సిమ్స్ చర్చ్ లోని, హనుమాన్ జంక్షన్ లో ఉన్న చిన్నాఆంజనేయ స్వామి గుడిలో మెగాస్టార్ చిరంజీవి, మెగా ఫ్యామిలీ అభిమానులు, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లాలిశెట్టి రవితేజ, జనసేన యువ నాయకుడు, జనసేన కార్పొరేట్ అభ్యర్ధి హుస్సేన్ ఖాన్, జనసేన కార్పొరేట్ అభ్యర్ధి చందు, పార్టీ యువ నాయకులు, చిరంజీవి యువత ప్రతినిధులు ముదిలి శ్రీనివాసరావు, సన్నిధి మధుసూదన రావు, భవానీ, అలీ, వినయ్, వాసు పాల్గొన్నారు.