జోరువానలో రోడ్ల దుస్థితిపై జనసేన వినూత్న నిరసన

*3 వ రోజు #GoodMorningCMSir

*గుంతల్లో కాగితపు పడవులు వేసి, గేలాం వేసి చేపలు పడుతూ నిరసన

*చివరిరోజైన, ఆదివారం భారీ జనసైనికులతో వినూత్న నిరసన

*నిద్రపోయిన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే లేవాలని పిలుపు

విజయనగరం: డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా రోడ్లపై ఉన్న పాడైపోయిన గుంతలను ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రతీ జనసైనికులు జూలై 15,16,17 తేదీల్లో #ఘూదంఒర్నింగ్ఛంశిర్ అని పోస్ట్లు పెట్టాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో చివరిరోజైన ఆదివారం ఉదయం కలెక్టరేట్ కూడలిలో ఉన్న కామాక్షి నగర్, అయ్యన్నపేట జంక్షన్ వద్ద భారీ గోతుల వద్ద జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన సాంస్కృతిక విభాగం ప్రతినిధి అదాడ మోహనరావు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) ఆధ్వర్యంలో జోరువానలో రోడ్ల దుస్థితి పై వినూత్నంగా నీటితో నిండిన గుంతల్లో కాగితపు పడవులు వేసి, గేలాం వేసి చేపలు పడుతూ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు అదాడ మోహనరావు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రోడ్లపై గుంతలు పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని, ఇకనైనా నిద్దురపోయినా ముఖ్యమంత్రి, రాష్ట్రంలో శాసనసభ్యులు మేల్కొని ప్రజలపక్షాన ఉండి న్యాయం చేయాలని, లేదంటే త్వరలో రోబోయే ప్రభుత్వం జనసేన అని, రోడ్లు గుంతలు పూడ్చడంతో పాటు, ప్రజలకు గొప్ప పాలన అందించే బాధ్యత జనసేన తీసుకుంటుందని హెచ్చరించారు.

కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత ప్రతినిధులు, జనసేన పార్టీ యువనాయకులు డాక్టర్ ఎస్. మురళీమోహన్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, చెల్లూరి ముత్యాల నాయుడు, లోపింటి కళ్యాణ్, రెయ్యి రాజు, అంబటి రవికిషోర్, గుల్లపాటి మోహన్ కుమార్, అల్లబోయిన శివ గణేష్ కృష్ణ, సీర కుమార్, జి.రాజేష్, లెంక నాగార్జున, పార్వతీశం, సాయి, గాడి బంగార్రాజు, చిన్నా, శివ పాల్గొన్నారు.