నిద్ర లేవండి సీఎం సార్.. నిద్ర లేవండి ఎమ్మెల్యే సార్: ముదినేపల్లి జనసేన

రాష్ట్ర ఆధినాయకులు పవన్ కళ్యాణ్ అదేశాలు మేరకు ఆంధ్రప్రదేశ్ రోడ్లను పట్టించుకోండి సీఎం సర్ అంటూ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రేడ్డి రామ కృష్ణా మరియు ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండల జనసేన నాయకులు #GoodMorningCMSir అనే హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ కాంపెయిన్లో భాగంగా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా “నిద్ర లేవండి సీఎంసార్ , నిద్ర లేవండి ఎమ్మెల్యే సార్” అంటూ.. తమ నిరసన గళం ఘనంగా వినిపించారు.. ఈ కార్యక్రమంలొ ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వర రావు, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, మండల గౌరవ అధ్యక్షులు పోకల కృష్ణా, మండల నాయకులు, దుసనపూడి బ్రాహ్మజీ, మండల కార్యవర్గ సభ్యులు భూపాల నాని, చింతా మురళి, వడ్లని ఆంజనేయులు, నాగడేసి గణేష్ బాబు, మండల జనసైనికులు అంబుల భరత్, పట్టపు గణేష్, అబ్దుల్ నజీర్ సాయిస్ సుదాబత్తుల, బోయిన శ్రీనివాస్, మాట్లపూడి మదన్, అను కుమార్, పళ్లెం నాగరాజు, పాల్గొన్నారు..