వాయిస్ ఆఫ్ జనసేన నర్సంపేట నియోజకవర్గం

  • బడా నేతల అండధండలతో సామాన్య ప్రజలే టార్గెట్ గా సాగుతున్న “చిట్ ఫండ్ కంపెనీల మోసాలు”
  • నర్సంపేటలో వివిధ చిట్ ఫండ్ కంపెనీలలో చిట్టీలు వేసి మోసపోయిన అనేక మంది బాధితుల ఆవేదన జనసేన పార్టీ దృష్టికి రావడం జరిగింది.
  • గతంలో వివిధ చిట్ ఫండ్ సంస్థల యజమానులను అరెస్ట్ చేసినప్పటికీ ఆగని మోసాలు
  • కొంత మంది రాజకీయ నాయకులే చిట్టీల లింక్ అప్ తో రియల్ ఎస్టేట్ వ్యాపారం- రాజకీయాలు.
  • ప్రభుత్వం- అధికారులు నికచ్చితంగా వ్యవహరించి బాధితులకి న్యాయం చేయాలని జనసేన పార్టీ డిమాండ్.

వరంగల్, పిల్లల చదువుకోసమో, పెళ్లిళ్ల కోసమో చిట్టీలు వేసి సొమ్ము దాచుకుందామనుకునే సామాన్య ప్రజలే టార్గెట్ గా చిట్ ఫండ్ కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయి. ఇటీవల నర్సంపేట పట్టణంలో వివిధ చిట్ ఫండ్ సంస్థలలో చిట్టీలు వేసి లేదా ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన బాధితులు వారి కాలం పూర్తి అయినప్పటికీ తమకి రావాల్సిన మొత్తం డబ్బులు తిరిగి ఇవ్వకుండా కొన్నాళ్లనుంచి ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటు నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆర్థికంగా నష్టపోయామనీ ఆవేదన చెందుతూ జన సేన పార్టీ దృష్టికి తీసుకరావడం జరిగింది.గతంలో వరంగల్ జిల్లాలో పోలీసులు చిట్ ఫండ్ కంపెనీ మోసాలపై 218 కేసులు నమోదు చేసినప్పటికీ, నలుగురు చిట్ ఫండ్ సంస్థల యజమానులను అరెస్ట్ చేసినప్పటికీ మళ్లీ చిట్ ఫండ్ కంపెనీలు భయం లేకుండా మోసాలకు పాల్పడుతున్నాయి. దీనికి ముఖ్య కారణం కొంతమంది రాజకీయ బడానేతలే చిట్ ఫండ్ సంస్థల వెనుక ఉండి చిట్టీలతో లింక్ అప్ అయి రియల్ వ్యాపారం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు. అలాగే చిట్ ఫండ్ కంపెనీలు ఖాతదారుల నుంచి చిట్టీలు వేయించి వచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి వెంచర్లు వేసి పాట్లుగా చేస్తూ చిట్టి గడువు పూర్తయిన సరే ఖాతాదారులకు తిరిగి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులుపెడుతూ వారితో బలవంతంగా ఎక్కువ ధరతో ప్లాట్లు కొనుగోలు చేపిస్తూ సంస్థ నిర్వాహకులు లబ్ది పొందుతున్నారు. తాము చెల్లించిన డబ్బులు తిరిగిరావేమో అని గత్యంతరం లేక బాధితులు అభద్రతాబావానికి లోనై ఎక్కువ ధరకు ఆ ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయి నష్టపోతున్నారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల నర్సంపేట పట్టణంలో ఒక చిట్ ఫండ్ కంపెనీ చేసిన మోసానికి న్యాయం కోసం జన సేన పార్టీని ఆశ్రయించిన నర్సంపేటకి చెందిన ఒక ప్రైవేట్ అధ్యాపకుడి ఉదంతం. ఇలా మోసపోయి నష్టపోయిన బాధితులు వరంగల్ జిల్లాలో ఎనిమిది వందల మంది పైనే ఉన్నట్లు సమాచారం. వీరు అందరూ చిరు వ్యాపారులు, సామాన్య మధ్యతరగతి ప్రజలే. కావున ప్రభుత్వం మరియు సంబంధిత పోలీసు అధికారులు నిక్కచిత్తంగా వ్యవహరించి చిట్ ఫండ్ కంపెనీల యాక్టులోని లోపాలను సవరించి బాధితులకి న్యాయం చేయాలని జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని జనసేన పార్టీ వరంగల్ జిల్లా మరియు నర్సంపేట నియోజకవర్గ నాయకులు మేరుగు శివ కోటీ యాదవ్ అన్నారు.