గ్లాసు గుర్తుకి ఓటు వెయ్యండి – జనసేనను ఆదరించండి

శ్రీకాళహస్తి, 67 వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారంలో భాగంగా శుక్రవారం శ్రీకాళహస్తి మండలం, రెడ్డిపల్లి పంచాయతీలోని ఎరమరెడ్డిపల్లి గ్రామంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ని ఆదరించాలని, నియోజకవర్గంలో శ్రీమతి వినుత కోటాని ఆశీర్వదించి, గాజు గ్లాసు గుర్తుకి ఓటు వెయ్యాలని ప్రజలను కోరడం జరిగింది. మార్పు కోసం జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. 5 సంవత్సరంలో గ్రామంలో త్రాగడానికి నీళ్లు ఇవ్వలేదని, సి.సి.రోడ్లు, డ్రైనేజ్ కాలువలు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కావలి శివకుమార్, జనసైనికులు రామ్, సురేంద్ర, అంకయ్య, గురవయ్య, నరేష్, ప్రసాద్, అశ్విన్, అరవింద్ నాయకులు వెంకట రమణ యాదవ్, నితీష్ కుమార్, నక్కా ప్రసాద్, పేట చంద్ర శేఖర్, తోట,జ్యోతి రామ్, పేట చిరంజీవి, లక్ష్మి, రాజ్యలక్ష్మి, శారద, రాజేష్, సురేష్, హేమంత్ గౌడ్, జనసైనికులు దినేష్, బబ్లూ, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.