ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం!

  • 18 ఏళ్లు నిండిన వారు తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు కావాలి
  • ఓటింగ్ శాతం పెరిగేందుకు కృషి చేయాలి
  • చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి
  • ప్రలోభాలకు లొంగని ఓటర్ల సమాజ నిర్మాణానికి కృషి చేయాలి
  • శ్రీ సాయిరాం డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కల్పించిన జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం: ప్రజాస్వామ్య దేశాలలో ఓటు కీలకమైనదని జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు అన్నారు. శనివారం పార్వతీపురం పట్టణంలోని శ్రీ సాయిరాం డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన ఓటు హక్కును 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ పొందాలన్నారు. 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండుతున్న ప్రతి ఒక్కరూ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆదివారం కూడా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తోందన్నారు. వయస్సు ధృవీకరించే పదవ తరగతి సర్టిఫికెట్, ఆధార్ కార్డు, తల్లి లేదా తండ్రి ఓటు ఐడి కార్డు జెరాక్షలతో పాటు సిక్స్ ఎ ఫారం నింపి బిఎల్ఓ కు అందజేయాలన్నారు. లేదా ఆన్లైన్లో ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవడంతో పాటు తమ తమ గ్రామాలలో ఉన్న ఓటు నమోదు చేసుకొని వారిని చైతన్యవంతం చేసి ఓటరుగా నమోదయ్యేలా కృషి చేయాలి అన్నారు. అలాగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓట్లు వేయాలని, ఓటింగ్ శాతం పెంచి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. నీతి నిజాయితీ కలిగిన చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. అలాగే ప్రలోభాలకు లొంగని ఓటరులున్న సమాజ నిర్మాణానికి ప్రతి యువతీ యువకులు కృషి చేయాలన్నారు. భారత ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం కల్పించిన ఓటు అనే వజ్రాయుధంతో సమానమైన ఓటుతో పంచాయితీ, మండలం, నగరం, జిల్లా, అసెంబ్లీ, రాష్ట్ర దేశ భవిష్యత్తును చక్కదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓటు నమోదుకు సంబంధించిన అవగాహన కల్పించారు.