ఓటర్ అవగాహన సదస్సు విజయవంతం

పీలేరు: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ నెహ్రూ యువ కేంద్ర కడప మరియు అన్నమయ్య జిల్లాల వారి ఆదేశం ఆదేశాల మేరకు పీలేరు షీ స్వచ్ఛంద సంస్థ వారు స్థానిక ఎమ్మార్వో ఆఫీసు నందు వెళ్లారు ఎమ్మార్వో మహబూబ్ బాషా మరియు డిస్టిక్ వాట్ వాటర్ మేనేజ్మెంట్ ఏపీ డి నందకుమార్ రెడ్డి బ్యానర్ను ఆవిష్కరించారు అని షీ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పి వి ఎస్ లక్ష్మి పత్రికా ముఖంగా తెలియజేశారు. అలాగే స్థానిక సంజయ్ గాంధీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఓటర్ అవేర్నెస్ అండ్ రిజిస్ట్రేషన్ నిర్వహించడం జరిగినది. అని షీ సంస్థ అధ్యక్షురాలు మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముకని నవభారత నిర్మాణంలో యువత పాత్ర కీలకమని ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన వెంటనే బాధ్యతగా ఓటు నమోదు చేసుకొని నిజాయితీతో కూడుకున్న నాయకులను ఎన్నుకొని దేశ నిర్మాణానికి తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించడమే కాకుండా ప్రతిజ్ఞ చేయించి రాలీ కూడా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పీలేరు ఎమ్మార్వో మహబూబ్ బాషా ఏ ఎస్ ఓ రామ్మోహన్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి వైస్ ప్రిన్సిపాల్ శివరామిరెడ్డి ఎన్సిసి అధ్యాపకులు పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు శ్రీనివాసులు రెడ్డి తెలుగు ఉపాధ్యాయులు షీ సంస్థ న్యాయ సలహాదారులు డాక్టర్ రాయల సుధాకర్ రాయలు పాల్గొనడం జరిగినది.