వారాహి యాత్ర సన్నద్దత సమావేశం

  • గురుదత్ కి ఘనస్వాగతం పలికిన రాజోలు జనసేన పార్టీ నాయకత్వం

రాజోలు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన అన్నవరం నుండి ప్రారంభించే వారాహి యాత్ర కార్యాచరణ నిమిత్తం మలికిపురం ఎల్.ఎస్ ల్యాండ్ మార్క్ లో జరిగిన వారాహి యాత్ర సన్నద్దత సమావేశంలో మేడ గురుదత్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వారాహి యాత్రలో భాగంగా రాజోలు నియోజకవర్గం కూడా జనసేన పార్టీ అధ్యక్షులు రానున్నారు. కావున జనసేన పార్టీ అధిష్టానం వారాహి యాత్ర రాజోలు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమలు ఇంచార్జ్ గా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు మేడ గురుదత్ ప్రసాద్ ని నియమించారు. రాజోలు నియోజకవర్గంలో జరిగే వారాహి యాత్ర ఏర్పాట్లుకు కమిటీలు & కార్యాచరణ కోసం నియోజకవర్గంలో ప్రముఖ జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ ఎంపిటిసిలు & జడ్పిటిసిలు జిల్లా కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గానికి సమావేశంలో గురుదత్ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.