సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారికి వార్నింగ్

ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి..  కానీ హైద్రాబాద్ నగరం, ప్రజలు శాశ్వతంగా ఉంటారని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఎలక్షన్స్‌కు చాలా మంది వస్తున్నారని.. హైద్రాబాద్‌లో ఏదో జరుగబోతోందన్న ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. నగర ప్రజలు సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. మత ఘర్షణలు, లా అండ్ ఆర్డర్ డిస్ట్రబ్ చేసే వాళ్లపై పీడీ యాక్ట్‌లు పెడతామని సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. నగరంలో ఎలాంటి ఘటనలు జరిగినా భారీ మూల్యం తప్పదన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారికి సీపీ వార్నింగ్ ఇచ్చారు.