జనంకోసం పవన్ – పవన్ కోసం మనం

కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం, వలస పాకల గ్రామం కొత్తపేట, పాత పేట(శెట్టిబలిజ ప్రాంతం) మరియు గొల్లపేట ప్రాంతాలలో జనంకోసం పవన్-పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఉమ్మడి కార్యాచరణలో భాగంగా స్థానిక జనసేన నాయకులు ఎమ్.శివ, వి నూకరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీగారు,మరియు తెలుగుదేశం నాయకులు దేవు వెంకన్న, ఎస్సి నాయకులు ఇమాన్యూల్ ఈ సందర్బంగా పర్యటన చేస్తున్న నాయకులకు ఈ గ్రామంలోని ఎస్సీపేటలో త్రాగునీరు లేదని, నేటికీ మంచినీరు బావి నుండి తెచ్చుకోవాలని, డ్రైనేజీ వ్యవస్థ లేదని, పారిశుధ్యం పట్టించుకోవడం లేదని,
ఎస్టి ఎరుకులకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా వైసీపీ నాయకులు దూరం పెట్టారని, సీసీ రోడ్లు నిర్మాణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి వైసీపీ నాయకులు అక్రమంగా బిల్లులు చేసుకుంటున్నారని, సిమెంట్ రోడ్డులు వేసి కాంట్రాక్టర్ గ్రావెల్ తో సైడ్ ఫిల్లింగ్స్ చేయలేదని, అర్హులు అయిన వారికి పథకాలు ఇవ్వడం లేదని, డబ్బులు తీసుకుని ఇళ్ల పట్టాలు ఇచ్చారని, టీడీపీలో లబ్ధిదారుల పథకాలను నిలిపి వేశారని ఇలా అనేక సమస్యలను తెలిపారు. కొద్దిరోజుల వ్యవదిలోనే జనసేన-టీడీపీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని సామాన్య ప్రజలు మెచ్చే పరిపాలన అందిస్తామని, మీ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, జనసేన యువత మరియు తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.