జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధం

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక 31 వ డివిజన్ గొల్లల రామాలయం, సూర్యనారాయణపురం నందు కరెంట్ బిల్లు పెంచిన జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఈజగన్మోహన్ రెడ్డి గత నాలుగేళ్ళ పదినెలల కాలం దేనికి సిద్ధం ఉన్నాడంటే 8 సార్లు కరెంట్ బిల్లులు పెంచడానికి అని అర్ధం అనీ, మళ్ళీ అవకాశం వస్తే ఈసారి 16 సార్లు పెంచుతానటాడనీ అందుకే ప్రజలందరూ ఒకటే చెపుతున్నారు జగన్మోహన్ రెడ్డిని దింపడానికి సిద్ధంగా ఉన్నామని. ఈవాళ కరెంటు వాడాలంటే భయపడిపోతున్నామనీ కారణమేంటంటే ఎప్పుడు ఎంత రేట్లు పెంచుతారో అనే భయమే కాకుండా ఉగ్గుపాలు తాగినప్పటి కాలంలో వాడకానికి రేట్లు పెంచామని ఇప్పుడు వసూలు చేస్తారనీ అన్నారు. దీనికితోడు కరెంటు బిల్లుతో అమ్మఒడి వగైరా వగైరా సంక్షేమ పధకాలను ఎందుకు ముడిపెడుతున్నారని నిలదీసారు. ఇళ్ళు లేని వీళ్ళు తల్లీ తంటండ్రి పిల్లలు కూతుల్లు అందరూ ఒకేచోట కాపురాలు చేసుకుంటూ జీవిస్తారనీ 3 తరాల కుటుంబాలు ఉన్నప్పుడు అయ్యే కరెంటు వాడకాన్ని సాకుగా చూపెట్టి పధకాలకి అనర్హులుగా తొలగిస్తే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. జనసేనపార్టీ ఒకటే చెపుతోందనీ కరెంటు బిల్లులకీ సంక్షేమ పధకాలకీ ఎటువంటి సంబంధంలేకుండా చేస్తామనీ, అలాగే రానున్న రోజులలో కరెంటు బిల్లులని పెంచని ప్రభుత్వం జనసేన-తెలుగుదేశం ఏర్పాటు చేస్తాయన్నారు. తామంతా కలిసికట్టుగా ఈ వై.సి.పి ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నామంటూ స్థానిక ప్రజలతో నినందించారు. ఈ కార్యక్రమంలో కోటిబోయిన సతీష్, అలి చిన్ని, హరిబాబు ఏసు, సాధనాల గంగాధర్, సతీష్, జగథ్, శ్రీకన్య, మాధవి, పుష్ప, సంధ్య, జ్యోతి, వాణి తదితరులు పాల్గొన్నారు.