అందర్నీ కలుపుకుపోతేనే జనసేనజెండా ఎగురవేయగలం

తిరుపతి, జనసేన-టిడిపి-బిజెపి పార్టీల పొత్తులో భాగంగా తిరుపతికి కేటాయించిన జనసేన సీటును గెలిపించుకోవడానికి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు మూడు పార్టీలను కలుపుకొని, ఆరని సైడ్ ట్రాక్ లో ఉన్న వైసిపి నాయకులను పక్కనపెట్టి ముందుకెళితే, అందరి సహకారంతో తిరుపతిలో జనసేన జెండా ఎగరవేయగలమని, జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. మంగళవారం కిరణ్ జనసేన మీడియాతో మాట్లాడుతూ జనసేన నాయకులతో కలిసి కిరణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతిలో పుట్టి పెరిగిన తాము 50 డివిజన్లో 272 పోలింగ్ బూతులలో నిలబడి దొంగ ఓట్లను ఎదుర్కొనే సత్తా తమకే ఉందన్నారు. తానంటే ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షంకు ఎందుకు దడ అని ప్రశ్నించారు. నన్ను టార్గెట్ చేసుకొని తనపై తప్పుడు రాతలు రాస్తున్న బ్రోకర్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఓ మగాడిలా రాజకీయం చేయాలన్నారు. తమ జనసేనానిపై కానీ జనసైనికులపై గాని తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు మా ఇల్లు కనిపించని వారికి, ఈరోజు ఎలా గుర్తొచ్చిందో నని అన్నారు. తిరుపతిలో ఇప్పటివరకు పని చేసిన నాయకులు, జనసైనికులు మా కేడర్ లేకుండా గెలవడం కష్టమని కిరణ్ స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో.. బాబ్జి, హేమ కుమార్, డాక్టర్ బాబు, ముక్కు సత్యవంతుడు, కొండ హరిప్రసాద్, రమేష్ నాయుడు, మునుస్వామి, రమేష్, బలరామ్, చరణ్, మనోజ్ మరియు జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.