జక్కంపూడి వీర మహిళలకు క్షమాపణ చెప్పాలి: ఎస్ వి బాబు

రాజానగరం నియోజకవర్గ రాజావారి అహంకారానికి హద్దు లేకుండా పోయింది. వరద బాధితుల సహాయం పదివేలకు పెంచాలని జనసేన వీర మహిళలు డిమాండ్ చేయడం జరిగింది. తనొక మహారాజులా ఫీల్ అవుతున్న జక్కంపూడి రాజా మహిళలపై అసహన వ్యక్తం చేస్తూ, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం రాజా చేతకానితనానికి నిదర్శనం.

గతంలో ఇతగాడు కాపు కార్పొరేషన్ చైర్మన్ వెలగబెట్టి కాపులకు చేసింది ఏమీ లేదు. పైసా నిధులు కూడా కార్పొరేషన్ తీసుకురాని అసమర్థపు చైర్మన్ గా చరిత్రలో నిలిచిపోతాడు.

మహిళలపై నోరు పారేసుకోవడం తప్ప నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సున్నా.

సదర్ రాజావారు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డాడు అనేది నియోజకవర్గంలో ఫుల్ టాక్.

రాజావారి గెలిసిన తర్వాత రాజానగరం ప్రజలను గాలి వదిలేసాడు.

అధికార మదంతో కన్ను, మిన్ను కనకుండా గాలి మాటలు మాట్లాడుతున్న జక్కంపూడి రాజాకు రాబోయే ఎన్నికల్లో పరాభవం తప్పదు.

వరద బాధితుల కష్టాలను తెలియజేయాలని ఉద్దేశంతో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న జనసేన వీర మహిళపై రెచ్చిపోయిన రాజా వెంటనే క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ తరపున పెడన నియొజికవరగ జనసేన నాయకులు ఎస్ వి బాబు డిమాండ్ చేసారు.