వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: డా. గంగులయ్య

పాడేరు: జనసేనపార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికలలో పాడేరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అందుకు మండలం ప్రధాన నాయకత్వానికి ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఇకపై క్షేత్రస్థాయి పర్యటన జనసైనికుల సమీకరణ గిరిజన ప్రజల ఆకాంక్షలు తెలుసుకోవాలని అలాగే అన్ని మండలాల్లో బలమైన క్యాడర్ భాగస్వామ్యం ప్రధానంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో జనసేనపార్టీ సంస్థాగతంగా, క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి క్యాడర్ ని గుర్తించి వాళ్ళందరిని కూడా పంచాయితి కమిటీ, బూత్ కమిటీలతో భాగస్వామ్యం చేయాలన్నారు. జనసైనికుల సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారని మీరందరు అప్పగించిన బాధ్యతలను వేగంగా నిర్వహించాల్సి ఉంటుందని పాడేరు మండల నాయకత్వానికి డా. గంగులయ్య జనసేనపార్టీ పాడేరు ఇన్చార్జ్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉపధ్యక్షురాలు శ్రీమతి కిట్లంగి పద్మ, సంయుక్త కార్యదర్శి కిల్లో రాజన్, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, ఉపాధ్యక్షులు సీసాల్ భూపాల్, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్ కుమార్, మాదేల నాగేశ్వరరావు, సుర్ల సుమన్, ముదిలి సుబ్బారావు, అశోక్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.