ప్రభుత్వం పేదల కన్నీళ్లు తుడవకుంటే ఖచ్చితంగా జనసేన ప్రశ్నిస్తోంది: డేగల దొరస్వామి

కౌలు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించి పవన్ కళ్యాణ్ ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఇస్తూ.. రైతు భరోసా యాత్ర అనంతపురం నుంచి ప్రారంభించి రెండో విడత ఏలూరులో చేయడం జరిగింది. కానీ ఎంతమంది ఉన్నాకూడా వారి అందరికీ జనసేన పార్టీ నుంచి కౌలు రైతుల ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు అందజేస్తానని పవన్ కళ్యాణ్ నిక్కచ్చిగా నిజాయితీగా చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న మా నాయకునికి అడ్డుతగులుతున్న వైసీపీ నాయకులకు ఈ పత్రికా ముఖంగా ముఖ్యంగా.. ఈ మధ్య కొత్తగా పదవీ బాధ్యతలు తీసుకున్న జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారికి, ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గారికి, దేవాదాయ శాఖ మంత్రి దారి రాజా గారికి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే మీరు మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నది ప్రజల సమస్యలు తీర్చే రాష్ట్ర ప్రయోజనాల కోసం బాగు పడే విధంగా చేస్తారని అందరూ చూస్తుంటే.. మీరు మాత్రం చదువుకున్న సంస్కారం పక్కన పెట్టి కాపు కులంలో పుట్టి ఒక హీన స్థితికి దిగ జారీ జనసేన పార్టీ అధ్యక్షులను మీరు వ్యక్తిగత దూషణలు చేయడం మీకు ఒక చెడు ముద్రగా మిగిలి పోయే విధంగా ఉంటుందని అర్థం కాకపోవటం మీ బుర్రలు ఏవిధంగా పనిచేస్తున్నాయో అర్థం కావడం లేదు. ఈ పత్రికా ముఖంగా సూటిగా ఈ మంత్రులను అడుగుతున్నాను మీరు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొనలేక మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉండటం మగతనం అనిపించుకోదు. ఒక ప్రశ్న రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయంగానే సమాధానం చెప్పాలి లేకపోతే నీ పని మీరు చేయాలి, అంతేగాని ఈ విధంగా మేము మిమ్మల్ని, మీ ఇళ్ళల్లో వాళ్ళని తిట్టలేక, చేతకాక చేతులు కట్టుకుని కూర్చోలేదు.. మా నాయకుడు నేర్పించిన సంస్కారం అది మీరు తెలుసుకోవాలి. అలాగే లైవ్ డిబేట్ లో మాట్లాడే వెంకట్ రెడ్డి నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది అని ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం. రాము నువ్వు మాట్లాడే మాటలు మీ యొక్క హీనమైన బజారు తనంగా ఉన్నాయి. కావున లైవ్ డిబేట్ లో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి మీ వైసీపీ నాయకులైన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే ముందు మీయొక్క ఇళ్లల్లో ఆడవాళ్ళు ఉన్నారని, వారిని కూడా పక్కవాళ్ళు విమర్శిస్తే ఎంత బాధ వస్తుందని తెలుసుకోవాలని కోరుచున్నాము. మా నాయకుడు యొక్క సంస్కారం వైసిపి నాయకులు యొక్క వ్యక్తిగత విషయాలను మాట్లాడకుండా ఆపుతున్నాయని జనసేనపార్టీ, జిల్లా సంయుక్త కార్యదర్శి డేగల దొరస్వామి తెలియజేసారు.