వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి – తిరుపతి జనసేన

• నిత్యం జగన్ కు పవన్ జపమే
• వైసిపి మంత్రులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి, పోటో షూట్ లకే పరిమితమైన పరిశ్రమల శాఖ మంత్రి
• మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నామకరణం చేసిన “ఆంధ్రా థానోస్ జగన్ మోహన్ రెడ్డి” నేను అన్ని మంచే చేస్తున్నాను అని ఆయన ఒక్కరే అనుకుంటారు, ప్రజలు కూడా అనుకోవాలి కదా
• వైకాపా మంత్రులు రాబంధుల్లా ప్రజలను దోచుకుంటున్నారు
• పవన్ కళ్యాణ్ కష్ఠార్జితాన్ని కడప జిల్లాలో రైతులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున 174 మంది బాధిత రైతులకు ఇచ్చారు
• వైకాపా నేతలు రాష్ట్ర ప్రజలను దోచుకోవడం మినహా చేసింది శూన్యం
• మహిళాభివృద్ధిని వైకాపా ప్రభుత్వం పూర్తిగా మరచిపోయింది, సిఎం జగన్ మోహన్ రెడ్డి తల్లికి, చెల్లికే రక్షణ లేనప్పుడు మహిళలను ఎలా కాపాడుతారు
• ఒక్క పరిశ్రమను రాష్ట్రానికి తీసుకువచ్చారా..?
• త్వరలో “ఓఎల్ఎక్స్” లో సేల్స్ కి వైసిపి.
• నిన్న వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన జనసేన నేతలు.

తిరుపతి, రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కారం జరగాలనే ధ్యేయంతో తమ జనసేనాని నాలుగో విడత జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తే, జనవాణి విజయవంతం కావడంతో వైకాపా మంత్రులు దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, మరికొందరు వైసిపి నేతలు తమ అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించడం పట్ల స్పందిస్తూ స్థానికి ప్రెస్ క్లబ్లో మంగళవారం వైకాపా అధిష్టానంపై జనసేన పార్టీ తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు సుమన్ బాబు, మరియు ముఖ్య నేతలు ఆనంద్ బాబు, మునస్వామి, సుమన్, రమేష్ రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు మాట్లాడుతూ… టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిగా తమ జనసేనానిని పాలక మంత్రులు విమర్శించడం పట్ల నిప్పులు చెరిగారు. తమ జనసేనాని రాష్ట్ర ప్రజలకు దత్తపుత్రుడని కొనియాడారు, వైసిపి బారినపడిన వైకాపా (ఫ్యాన్ పార్టీ) బాధితులే తమ పవన్ ను కలిసి వారి గోడును చెప్పుకున్నారన్నారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ రాష్ట్రానికి ఒక పరిశ్రమ తీసుకురాని దుస్థితని, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని చేతగాని మనిషిగా అమర్నాథ్ చరిత్రలో నిలిచిపోతారని దుయ్య బట్టారు, మా అధినేతను నోటికొచ్చినట్లు విమర్శిస్తే తాట తీస్తామని, త్వరలో ప్రజలే మీకు దేహశుద్ధి చేస్తారని హెచ్చరించారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నామకరణం చేసిన విధంగా ఆంధ్ర ధానోస్ జగన్ మోహన్ రెడ్డి అని మరోసారి గుర్తు చేశారు. వైకాపా నేతలు రాష్ట్ర ప్రజలను దోచుకోవడం తప్ప అభివృద్ధి చేసింది శూన్యమని, ఒక పరిశ్రమను ఈ రాష్ట్రానికి తీసుకు వచ్చారా అంటూ ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ తన కష్టార్జితాన్ని 3000 మంది కవులు రైతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఇస్తూ అందులో భాగంగా మొన్న జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో 174 మందికి లక్ష రూపాయలు చొప్పున అందించారని, వైసీపీ మంత్రులు ఈ రాష్ట్ర ప్రజలను రాబందుల్లా దోచుకు తింటున్నారని, సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి చెల్లెలికి రక్షణ ఎవరైనా రాష్ట్ర మహిళలకు రక్షణ ఏ విధంగా ఇస్తారని, మహిళల రక్షణను మహిళాభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందని, అధికార పార్టీ మంత్రులు ఫోటోషూట్ లకే పరిమితం అవుతున్నారని, వైకాపా విముక్తి ఆంధ్ర ప్రదేశ్ కావాలని, త్వరలోనే వైసీపీని ఓఎల్ఎక్స్ లో పెట్టుకునే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా వారు ఎద్దేవా చేశారు.