వైసీపీ చేపట్టిన బస్సు యాత్రను అడ్డుకుంటాం: జిలానీ

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు న్యాయం చేయకుండా యాత్రలు చేసే అర్హత లేదని.. సామాజిక న్యాయం పేరుతో వైసీపీ మంత్రులు చేపట్టిన బస్సు యాత్రను అడ్డుకుంటామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జిలానీ ప్రకటించారు. శనివారం ఉదయం జిలానీ, నరసరావుపేట జనసేన నాయకులను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా జిలాని మీడియాతో మాట్లాడుతూ . వైసీపీది సామాజిక న్యాయం బేరి యాత్ర కాదని ఘోరీ యాత్రని ఎద్దేవా చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ, సబ్ప్లాన్ బీసీలకు వాడకుండా.. ప్రభుత్వం సొంత అవసరాలకు దారి మళ్ళించడం సిగ్గుచేటని.. ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చుకోకపోతే జనసేన పార్టీ తరఫున కచ్చితంగా ప్రశ్నించి తీరుతామని.. ప్రజల తరఫున పోరాటం చేస్తాం అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో.. జి ఎస్ ప్రసాద్, అద్దెపల్లి ఆనంద్ బాబు, ఆర్కే యాదవ్, వీరవల్లి వంశీ, అబ్దుల్ రవూఫ్, కృష్ణంశెట్టి గోవింద్, అచ్చుల సాంబశివరావు, చెన్నుపల్లి సాంబ, గుప్తా శ్రీకాంత్, బెల్లంకొండ అనిల్, శాండీ సైదా, నాగుల్ మీరా, విజయ్, మిరియాల సోము, బోనం జయరామ్, తెడ్లవెంకటేశ్వర్లు, సంజయ్ కత్తుల, చావా అనిల్, తిరుమల శెట్టి శీను, దమలం కొండలు, నారదాసు వెంకటేశ్వర్లు, హోసూర్ రాముడు, అశోక్, దుర్గా కుమారి, ప్రమీల, రమ్య తదితరులు పాల్గొన్నారు.